Amit Shah Video: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. మే 1న ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరుకావాలని కోరారు.
అమిత్ షా ఫేక్ వీడియోలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. ఈ ఇష్యూపై ఇవాళ (సోమవారం) ఆయన మాట్లాడుతూ.. ఫేక్ వీడియోలు సృష్టించే వాళ్లకు తగిన గుణపాఠం చెబుతామంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాజీ రాజకీయ వేత్త అయిన జోసెఫ్ గోబెల్స్‌ను మోడీ స్ఫూర్తిగా తీసుకున్నారంటూ మండిపడ్డారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారు. దీంతో ఆయనపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోడీని అనర్హులుగా ప్రకటించడంతో పాటు ఆరేళ్ల పాటు నిషేధించాలని పిటిషన్లో తెలిపారు.
PM Modi: ఇటీవల కర్ణాటకలోని హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హిరేమత్(22) కాలేజ్ క్యాంపస్‌లో దారుణహత్యకు గురైంది. ఫయాజ్ అనే నిందితుడు కత్తితో పలుమార్లు దాడి చేసి హత్య చేశాడు.
Amit Shah: రిజర్వేషన్లను తొలగించేది లేదని బీజేపీ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లను బీజేపీ తొలగించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
Asaduddin Owaisi: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ‘‘ఎక్కువ పిల్లలు ఉన్నవారు’’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. కర్ణాటక బెళగావిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.
V. Hanumantha Rao: కాంగ్రెస్ కులగణన చేస్తామంటే.. మోడీకి భయం పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. మోడీ ఇండియా కూటమి వస్తే సంవత్సరానికి ఒకరు ప్రధాని అవుతారని చెపుతున్నారని తెలిపారు.
Minister Seethakka: బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. పదేళ్ళ బీజేపీ పాలనలో ఏం చేసింది? అని ప్రశ్నించారు.