PM Modi: ప్రపంచ నాయకులు ‘డెమోక్రటిక్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్’ జాబితాలో ప్రధాని నరేంద్రమోడీ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రపంచ నాయకుల్లో ఎవరికీ లేని ఆదరణ మోడీకి ఉన్నట్లు తేలింది. అమెరికా బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన ‘‘మార్నింగ్ కన్సల్ట్’’ శుక్రవారం విడుదల చేసిన డేటాలో మోడీ అగ్రస్థానంలో ఉన్నట్లు చూపించింది. ప్రధాని మోడీకి ఏంకగా 75 శాతం అప్రూవల్ రేటింగ్ ఉందని తెలిపింది.
పాపులారిటీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న నరేంద్ర మోదీ ఇప్పుడు మరో సరికొత్త రికార్డు సృష్టించారు. యూట్యూబ్ ఛానెల్‌లో 20 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను చేరుకున్న ప్రపంచంలోనే మొదటి నాయకుడిగా ప్రధాని మోడీ నిలిచారు. మీరు సాధారణ పదాలలో అర్థం చేసుకుంటే 2 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానెల్‌కి కనెక్ట్ అయ్యారు.