PM Modi: ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రారంభించిన “ఆపరేషన్ రైజింగ్ లయన్” నేపథ్యంలో ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యహు భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు. ఈ సంభాషణలో మోడీ ప్రస్తుత పరిస్థితులపై తన ఆందోళనను వ్యక్తపరిచారు. అలాగే ఆ ప్రాంతంలో తొందరగా శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనాల్సిన అవసరాన్ని బెంజమిన్ నెతాన్యహుకు తెలిపారు. మోడీ తన అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో.. “ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు ఫోన్‌లో నన్ను సంప్రదించారు. ఆయన ప్రస్తుత పరిస్థితులను…