ప్రధాని మోడీ ఈ నెల 26న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించనున్న స్నాతకోత్సవ వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు 26 తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే..…