ఔటర్ రింగ్ రోడ్డు (ఓఅర్అర్) ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆధారిటీ(హెచ్ఎండిఎ) ప్రత్యామ్నాయంగా స్థలాలు (ప్లాట్లు) లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరుపుతుంది. అందులో భాగంగా బుధవారం 15వ తేదీన 17 మంది బాధితులకు ప్లాట్ల కేటాయింపులు జరిపేందుకు హెచ్ఎండిఎ నిర్ణయించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్(పిడి), ఓఆర్ఆర్ ప్రాజెక్ట్(ఆర్అండ్ఆర్) స్పెషల్ కలెక్టర్ సంతోష్ ఐఏఎస్ మరియు ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ (ఆర్అండ్ఆర్) స్పెషల్ ఆఫీసర్, బి.అపర్ణ ఆధ్వర్యంలో…