భారత కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అభిమానులకు ఇదొక శుభవార్త. డిసెంబర్ 2022లో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్.. తొందరగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో పంత్ కోలుకుంటున్నాడు. ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అయితే.. తను ఇటీవల వీధిలో పిల్లలతో కలిసి గోళీలు ఆడుతూ కనిపించాడు. పిల్లలతో కలిసి కింద కూర్చుంటూ గోళీలాట ఆడాడు. వారిలో కలిసి పోయి సీరియస్‍గా గోళీలకు గురి పెడుతూ ఆట కొనసాగించాడు. పిల్లలతో పోటీ పడుతూ…