ఔటర్ రింగ్ రోడ్డు (ఓఅర్అర్) ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆధారిటీ(హెచ్ఎండిఎ) ప్రత్యామ్నాయంగా స్థలాలు (ప్లాట్లు) లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరుపుతుంది. అందులో భాగంగా బుధవారం 15వ తేదీన 17 మంది బాధితులకు ప్లాట్ల కేటాయింపులు జరిపేందుకు హెచ్ఎండిఎ నిర్ణయించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్(పిడి), ఓఆర్ఆర్ ప్రాజెక్ట్(ఆర్అండ్ఆర్) స్పెషల్ కలెక్టర్ సంతోష్ ఐఏఎస్ మరియు ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ (ఆర్అండ్ఆర్) స్పెషల్ ఆఫీసర్, బి.అపర్ణ ఆధ్వర్యంలో…
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం… వచ్చే ఏడాది జులై 1వ తేదీ నుంచి… ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలపై ఈ నిషేధం విధిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది కేంద్రం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, విక్రయం, వాడకంపై ఈ నిషేధం ఉంటుందని తెలిపింది.…