SLBC Tunnel Accident: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో జరిగిన భయంకరమైన ప్రమాదం దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల విషయంలో అధికారులు ఆశలు వదులుకుంటున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తుండటంతో కార్మికులు ప్రాణాలతో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్‌లో భారీ ఎత్తున మట్టి కూలిపోవడం, నీరు, బురద చేరడంతో వారు బయటపడే అవకాశం మరింత తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. కార్మికులు టన్నెల్ బోరింగ్ మెషీన్…