Business Headlines 04-02-23: తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్ల అప్‌డేషన్: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్లని ఆధునికీకరించే ప్రణాళికలను ఇండియా సిమెంట్స్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు 16 వందల కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు పేర్కొంది. ఇండియా సిమెంట్స్‌కి తెలంగాణలోని మల్కాపూర్ మరియు విష్ణుపురంలలో పాత ప్లాంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిలంకూర్, ఎర్రగుంట్లలో కూడా ఉన్నాయి. ఈ ప్లాంట్లను ఆధునికీకరించే ప్రక్రియ ఏడాదిన్నర వరకు పట్టొచ్చని ఇండియా సిమెంట్స్ చైర్మన్ అండ్ ఎండీ ఎన్.శ్రీనివాసన్ తెలిపారు.