France: 300 మందికి పైగా భారతీయులతో వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు ఆదేశంలో నిలిపేసినట్లు శుక్రవారం తెలిపారు. ప్రయాణికులను తీసుకెళ్తున్న విమానం ‘మానవ అక్రమ రవాణా’ అనుమానంతో విమానాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. రహస్య సమాచారం రావడంతో ఈ విమానాన్ని అధికారులు అడ్డుకున్నారు. యూఏఈ నుంచి ఈ విమానం బయలుదేరింది. దక్షిణ అమెరికాలోని నికరాగ్వాకి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.