అటు హిందీలోనూ, ఇటు తమిళంలోనూ ఓటీటీలలో వస్తున్న ఆంథాలజీలను చూసి… తెలుగువాళ్ళు సైతం అలాంటి వాటిని తీయగలరు అని నిరూపించడానికి నలుగురు ప్రముఖ తెలుగు దర్శకులు నడుంకట్టారు. నిజానికి వాళ్ళను అందుకు ప్రేరేపించింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ అనుకోవచ్చు. బడ్జెట్ పరమైన పరిమితులు కూడా బహుశా పెద్దంతగా ఉండి ఉండకపోవచ్చు. దాంతో ఉన్నంతలో ఈ ఆంధాలజీని కాస్తంత గ్రాండ్ గా తీసే ప్రయత్నం చేశారు. ఇది అభినందించదగ్గదే. కానీ పేరున్న ఈ నలుగురు దర్శకులు…