పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పదవిని జనసేనకు.. వైస్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు.. అయితే, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మూడు చోట్ల పోటీ చేస్తే మూడు చోట్ల విజయం సాధించగా.. టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట మాత్రమే గెలిచారు.. ఇదే ఇప్పుడు చర్చగా మారింది..
కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన మద్దతుతో విడివిడిగా పోటీకి దిగడంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోకస్‌పెట్టారు.. రెండు పార్టీల నియోజకవర్గ నేతలను సమన్వయం చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడుకి బాధ్యతలు అప్పగించారు..