పిఠాపురంలో మైనర్ బాలికకు మద్యం తాగించి బలాత్కారం చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. దీనిపై వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మహిళలకు భద్రత లేదా అంటూ ప్రశ్నింస్తోంది. ఇదే విషయమై వైసీపీ అధికార ప్రతినిధి రోజా కూడా పవన్ కల్యాణ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉపముఖ్యమంత్రి ఇలాకాలోనే మైనర్ బాలికపై దారుణం జరిగితే చర్యలేవంటూ ప్రశ్నించారు. ఈ మేరకు మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా పవన్‌కు ట్వీట్ చేశారు.