Rare Pink Diamond Sells For Record Price: ప్రపంచంలో వజ్రాలకు చాలా డిమాండ్ ఉంది. ఏంతగా అంటే వందల కోట్లు పెట్టి మీర వజ్రాలను కొనుగోలు చేస్తుంటారు కొందరు. వజ్రాల్లో పింక్ డైమండ్ కు మరింత ఎక్కువ డిమాండ్ ఉంది. తాజాగా ఓ పింక్ డైమండ్ కు రికార్డు ధర పలికింది. హాంకాంగ్ లో వేలం వేయగా.. అమెరికా ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి రికార్డు ధరతో కొనుగోలు చేశారు.
ప్రపంచంలో వజ్రాలు ఎంతో విలువైనవి. మామూలు వజ్రాలు సైతం లక్షల రూపాయల్లో ఉంటాయి. ఇక అరుదైన వజ్రాల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అరుదైన వజ్రాలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఇటీవలే హాంకాంగ్‌లో ఓ పింక్ వజ్రాన్ని వేలం వేశారు. ది సకురా పేరుతో ఉన్న ఈ వజ్రం బరువు 15.8 క్యారెట్లు ఉంది. అరుదైన ఈ పింక్ వజ్రం 29.3 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని ఆక్షన్.హౌస్ తెలియజేసింది. ఈ పింక్ వజ్రానికి ప్లాటినం,…