గత వారం అమెరికా వైద్యులు తొలిసారిగా జన్యు మార్పిడి చేసిన పంది గుండెను విజయవంతంగా మనిషికి అమర్చారు. సర్జరీ అయిన పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలో అతడు పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు నమ్ముతున్నారు. మరోవైపు, అవయవ మార్పిడిపై జరుగుతున్న ప్రయోగాలలో ఈ సర్జరీ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వైద్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్ని దశాబ్దాలలో జరిగిన సాంకేతిక అభివృద్ధి ఫలితంగా వైద్య రంగం ఎంతో ముందుకు వెళ్లింది. అనేక వైద్య సదుపాయాలు నేడు…