స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా క్రీడాకారిణులను లైంగిక వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్ వినాయక ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు ఏలూరు పోలీసులు.. కోచ్ వినాయక ప్రసాద్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు..
శుక్రవారం(మార్చి 1) జార్ఖండ్‌లోని దుమ్కాలో సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ మహిళ భర్తకు జార్ఖండ్ పోలీసులు రూ.10 లక్షల పరిహారం అందజేశారు. అత్యాచారానికి గురైన స్పానిష్ పర్యాటకురాలికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ రూ.10 లక్షల (11,126.20 యూరోలు) పరిహారం అందించింది. ఆమె ఖాతాకు డబ్బు బదిలీ అయింది. చెక్కు కాపీని, నగదు బదిలీకి సంబంధించిన లేఖను బాధితురాలి భర్తకు దుమ్కా డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు దొడ్డే, ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖేర్వార్ అందించారు.