Haryana: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే తప్పుడు పనులకు పాల్పడ్డాడు. ఉన్న హోదాలో ఉన్న ప్రిన్సిపాల్ కీచకుడిగా మారాడు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానాలోని జింద్ జిల్లాలో చోటు చేసుకుంది. 50 మందికి పైగా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం ప్రకటించారు. నిందితుడైన వ్యక్తిని శనివారం అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. ఈ కేసును విచారించేందుకు డీఎస్పీ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు…