Kishan Reddy : హైదరాబాద్ ముత్యాల నగరంగానే కాకుండా, ప్రపంచ ఫార్మసీగా, అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రుల కేంద్రంగా ఖ్యాతికెక్కిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో 22వ ఎడిషన్ బయో ఆసియా-2025 లాంటి గ్లోబల్ ఈవెంట్స్ నగర వేదికగా జరగడం, హెల్త్‌కేర్ రంగంలోని సాంకేతికత, సుస్థిరమైన పద్ధతుల గురించి చర్చించడం ఎంతో ఆనందకరమని అన్నారు. బుధవారం బయో ఆసియా-2025 సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఆవిష్కర్తలకు పురస్కారాలు అందజేశారు.…
India ready to export fever drugs to China amid COVID surge: ప్రపంచంలో అతిపెద్ద డ్రగ్ మేకర్ అయిన ఇండియా, చైనాకు జ్వరం మందులు పంపేందుకు సిద్దం అవుతోంది. కోవిడ్-19 వల్ల చైనా తీవ్రంగా దెబ్బతింటోంది. అక్కడ రోజుకు కొన్ని లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో చైనాకు ఫీవర్ మెడిసిన్స్ ఎగుమతులను పెంచేందుకు సిద్ధంగా ఉందని భారత ఔషధ ఎగుమతి సంఘం చైర్‌పర్సన్ గురువారం తెలిపారు.