Jubilee Hills Byelection: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో చివరి రోజున భారీ హడావుడి నెలకొంది. నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా పోటీకి రంగంలోకి దిగుతున్నారు. ఓవైపు నిరుద్యోగులు తమ సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడానికి నామినేషన్లు వేస్తుండగా, మరోవైపు ఫార్మాసిటీ, RRR ప్రాజెక్టుల బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.…