హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంకుల మోసాలు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. పెట్రోల్ తక్కువ వచ్చి, మీటర్ మాత్రం కరెక్ట్‌గా చూపించే విధంగా చిప్స్ అమర్చిన పెట్రోల్ బంక్ నిర్వాహకులు, ఈ ప్రత్యేక చిప్‌ల ద్వారా జనాలని మోసం చేస్తున్నారు.
ఓవైపు కలలో కూడా వాహనదారులను పెట్రోల్, డీజిల్ ధరలు ఆందోళనకు గురిచేస్తుంటే.. మరోవైపు పెట్రోల్ బంకులు కూడా మోసాలకు పాల్పడుతూ.. సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే సుంకాలతో వాహనాలను రోడ్డుపైకి తీసుకువద్దామంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే ఆఫీసుకు వెళ్లాలన్నా, నిత్యావసరాలకు బైకో, కారో బయటకు తీస్తే.. బంకుల్లో జరిగే మోసాలకు జేబుల్లో ఉన్న డబ్బంతా ఖాళీ అవుతోంది. ఇలాంటి ఘటనే హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్…