పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రం వ్యాట్‌ను తగ్గించాలనే డిమాండ్‌తో ఈనెల 8న బీజేపీ నిరసనలు చేపడుతందని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాని పన్నులు తగ్గించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఉన్న వ్యాట్ తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా…
కేంద్రం తరహాలోనే ఏపీ కూడా పెట్రో ఉత్పత్తులపై తన వాటా వ్యాట్ ను తగ్గించుకోవాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహార్ అన్నారు. పెట్రో రేట్లు తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కనీసం ఏపీ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేస్తుందా లేదా అన్నారు. కేంద్రం బాటలోనే ఇప్పటికే చాలా రాష్ట్రాలు తమ వాటా పన్నులను తగ్గిస్తు ప్రజలపై భారాన్ని తగ్గిస్తున్నాయిన్నారు. అస్సాం, త్రిపుర, కర్ణాటక, మణిపూర్, గుజరాత్, గోవా రాష్ట్రాలు రూ.7…
దేశంలో సామాన్యులకు పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్న వేళ.. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో వినియోగదారులకు తాత్కాలికంగా స్వల్ప ఉపశమనం కలిగింది. అయితే భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయని ఇంధన నిపుణుడు నరేంద్ర తనేజా వెల్లడించారు. 2023 నాటికి లీటర్ పెట్రోల్ ధర మరో రూ.100 పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. చమురు అనేది విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదని… దాని ధరలను నియంత్రించడం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో…
పెట్రోలు, డిజీల్‌పై కేంద్రం వరుసగా రూ.10, రూ.5 తగ్గించిన నేపథ్యంలో, కర్ణాటకప్రభుత్వం పెట్రోల్, డిజీల్‌పై సేల్స్ ట్యాక్స్ రేటును రూ.7 తగ్గిస్తూ, దీపావళి సందర్భంగా ప్రజలకు తీపి కబురు నందించింది. రాష్ట్రంలో డీజిల్ ధర రూ.104.50 నుంచి రూ.85.03కి తగ్గింది, రూ.19.47 తగ్గింపు’’ అని జీవో జారీ చేసింది. పెట్రోలు ధర రూ. 113.93 నుంచి రూ. 100.63కి తగ్గింది, రూ. 13.30 తగ్గింపు’’ అని ఆ జీవోలో కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల్లో…
పెట్రోల్, డీజిల్ రేట్లు ఇష్టానుసారం పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులను దోపీడి చేస్తున్నాయని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. పెట్రోల్, డిజీల్ పై లీటర్ ధరపై కేంద్రం రూ.5, రూ.10 తగ్గించి బీజేపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. లీటర్‌పెట్రోల్‌పై రూ.50 తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే దేశ ప్రజలకు మేలు జరుగుతందని ఆయన అభిప్రాయ పడ్డారు. అయితే యూపీలో ఎన్నికలు పూర్తవ్వగానే కేంద్రం మళ్లీ…
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. పెంచింది బారెడు.. తగ్గించింది చిటికెడు అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ‘మోదీజీ గత సంవత్సరంలో లీటర్ పెట్రోల్ రూ.28.28, లీటర్ డీజిల్ రూ.27.61 మేర పెరిగాయి. ఇటీవల ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.10 తగ్గించారు. దయచేసి ‘పెద్ద ఉపశమనం’ కలిగించాం అని చెప్పకండి’ అంటూ ఇండియన్ యూత్…
పెట్రోల్ ధరల విషయంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగింది. దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ పన్ను తగ్గించడంతో గురువారం నుంచి నూతన ధరలు అమల్లోకి వచ్చాయి. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించింది. అంతేకాకుండా రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించినట్లు తెలుస్తోంది. Read Also: పెట్రోల్ రేట్లను మరింత…
దీపావళి వేళ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.10 తగ్గాయి. ఈ తగ్గింపు ధరలు గురువారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే రాష్ట్రాలు కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో 9 బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్‌పై విధించే పన్నును తగ్గించాయి. ఈ జాబితాలో అసోం, త్రిపుర, మణిపూర్,…
దేశవ్యాప్తంగా చమురు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడంతో పెట్రోల్ బంకు వైపు వెళ్లాలంటే సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. బుధవారం (నవంబర్ 3) కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర 37 పైసలు పెరిగి రూ.114.49గా ఉంది. లీటరు డీజిల్ ధర 40 పైసలు పెరిగి రూ.107.40కి చేరింది. మరోవైపు ఏపీలోని విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.116.61గా, లీటరు డీజిల్ ధర రూ.108.89గా…