ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేశారు కొందరు నాయకులు. రాజకీయ అలజడి నెలకొంటే వెంటనే సీన్‌లోకి వచ్చేవారు. మంత్రులంటే వీరే అన్నట్టుగా బిల్డప్ ఉండేది. తరచూ సీఎమ్ క్యాంపు కార్యాలయానికి రావటం.. మీడియా సర్కిళ్లలో హడావిడి చేయటం మామూలే. అంతెందుకు.. ముఖ్యమంత్రికి పలానా సలహా ఇచ్చిందే నేనే.. సీఎమ్ స్వయంగా నన్ను పిలిచి మూడు గంటలుపాటు నాతో కూర్చుని చర్చించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు అని చెప్పినవాళ్లూ ఉన్నారు. ఆ అంశంపై సీఎమ్‌కు…
ఒకవైపు టికెట్ల వివాదం, మరో వైపు థియేటర్లలో తనిఖీలు, యజమానుల మూసివేతలు ఏపీలో వినోదరంగాన్ని కుదిపేస్తున్నాయి. సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి ప్రధానమయింది. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమాపై వివాదాలు నెలకొనడం.. క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం కలవరం కలిగిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో నష్టపోయేది ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో సినిమాలంటే 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఆడాలని భావించేవారు. కానీ ఇప్పుడు సినిమాలంటే మొదటి వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడంతా…
ఏపీలో ఆన్ లైన్ టికెట్ల వ్యవస్థకు సర్వం సిద్ధం అవుతోంది. ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థకు నోడల్ ఏజెన్సీగా APSFTVDC నియామించింది. ప్రభుత్వ ఉత్తర్వులతో ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది APSFTVDC. ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ ఎలా వుండాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. పోర్టల్ రూపకల్పనపై ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెటింగ్ సంస్ధలతో ఒకటికి రెండు సార్లు భేటీ నిర్వహించారు మంత్రి పేర్ని వెంకట్రామయ్య, అధికారులు. వివిధ సినీ థియేటర్లతో ప్రైవేట్…