ఏపీలో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈరోజు చంద్రబాబు 73వ పుట్టినరోజు. తన బర్త్ డే నుంచే ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు ఎంటర్ అవుతున్నారు. ఈ మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెం గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. అడవినెక్కలం అంబేద్కర్ నగర్ నుంచి నెక్కలం గొల్లగూడెం వరకు చంద్రబాబు పాదయాత్ర…
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇకపై ప్రజలు తాము ఉన్న చోట నుంచే తమ సమస్యలను ప్రస్తావించి పరిష్కరించుకునే విధంగా ప్రజా బంధు పేరుతో నూతన యాప్‌ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజాబంధు యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యలను ఇకపై నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. త్వరలో ఈ…