జనగామ జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన కురిసింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. కొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. జనగామ ,లింగాల గణపురం, రఘునాథపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి పంట నేలరాలింది. పలుచోట్ల రహదారులపై చెట్లు నేలకొరిగాయి.
Ponguleti Srinivas reddy : ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామాన్ని మోడల్ గ్రామంగా ఎంపిక చేసి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో సరైన అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అయితే, గత 15 నెలలుగా ఇందిరమ్మ పాలనలో రాష్ట్రం…
Robberies: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బిసి కాలనీలో దొంగలు మంగళవారం (డిసెంబర్ 31) అర్దరాత్రి బీభత్సం సృష్టించారు. జనసంచారం మధ్య జరిగిన ఈ దొంగతనం కలకలం రేపింది. వరుసగా మూడు ఇళ్ళలో చోరీకి పాల్పడిన దుండగులు 25 గ్రాముల బంగారం, 38 వేల రూపాయల నగదు, ఓ మొబైల్ ను అపహరించారు. ఈ సంఘటనతో కాలనీ వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. దొంగతనం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరి కూడా లేకపోవడం దొంగలకు సులభంగా పని…