సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సింగిల్ “కళావతి”లో చాలా యవ్వనంగా, మనోహరంగా కనిపించాడు. కీర్తి సురేష్ కూడా ఈ సాంగ్ లో అంతే అందంగా కన్పించింది. యూట్యూబ్ లో రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ కళావతి” చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక ఈ చిత్రం రెండవ సింగిల్ ‘పెన్నీ’ ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ ప్రోమోలో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా కన్పించగా, మరో సర్పైజ్ ఇచ్చారు మేకర్స్.…