‘పెంకిపెళ్ళాం’ చిత్రం గురించి చెప్పుకోవాలంటే, నటరత్న యన్.టి.రామారావు, దర్శకులు కమలాకర కామేశ్వరరావు మైత్రీబంధం గురించి తప్పకుండా ముచ్చటించుకోవడానికి ఈ సినిమా ఆస్కారమిస్తుంది. కామేశ్వరరావు ముక్కుసూటి మనిషి. ఏది అనిపిస్తే అదే చెప్పేవారు తప్ప ముఖస్తుతి ఆయన నచ్చదు. అలాంటి కామేశ్వరరావు రాసిన రివ్యూ నచ్చి మరీ మదరాసు పిలిపించుకున్నారు హెచ్.ఎమ్.రెడ్డి. తరువాత కామేశ్వరరావు , కేవీ రెడ్డి వద్ద అసోసియేట్ గా ‘పాతాళభైరవి’కి పనిచేశారు. ఆ సినిమా స్క్రీన్ ప్లేలోనూ కమలాకర పాత్ర ఉంది. అది గమనించిన…