AP Govt: తెలంగాణ రాష్ట్రానికి చెందిన 58 మంది క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి వచ్చిన 698 మందిని.. గతంలో తెలంగాణకు పంపింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో అధికారులతో భేటీ ముగిసింది. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించాల్సిన అంశాలపై చర్చించారు. ఏపీ, తెలంగాణ విభజన అంశాలపై చర్చించాల్సిన అంశాలను సీఎం చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. సాయంత్రం 5:30 గంటల తరువాత సీఎం చంద్రబాబు ప్రజాభవన్ బయలుదేరనున్నారు. అనంతరం.. షెడ్యూల్ 9, 10 లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఆస్తుల పై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
AP & TG CMs Meeting: ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ లో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుంది.