నర్సాపూర్ లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 21న ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో నర్సాపూర్ టికెట్ పెండింగ్ లో పార్టీ అధిష్టానం పెట్టింది. గత వారం నుంచి ఎమ్మెల్యే వరుసగా ఆందోళనలు చేస్తున్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు సీఎస్ సమీర్ శర్మ. సీఎస్ తో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. గత కొంతకాలంగా పెండింగ్‌లో వున్న ఆర్థికేతర అంశాలను తక్షణం పరిష్కరిస్తామని గతంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో జరిగిన భేటీలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఉద్యోగుల అర్ధికేతర సమస్యల పరిష్కారంపై ఇప్పటికే దృష్టి సారించింది ప్రభుత్వం. ఆర్దిక సమస్యలపై జాయింట్ స్టాఫ్…