రాష్ట్రంలో విద్యుత్ రంగంలో నెలకొన్న సమస్యలపై విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం సాయంత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. బొగ్గు కొరత వల్ల దేశంలోని అనేక రాష్ట్రాలు విద్యుత్ సమస్యలతో సతమతం అవుతున్నాయని తెలిపారు. ఏపీలో విద్యుత్ సమస్యలకు కూడా దేశంలోని బొగ్గు కొరత కారణమని వెల్లడించారు. అటు కరోనా సంక్షోభం, భారీ వర్షాలు బొగ్గు ఉత్పాదనను ప్రభావితం చేశాయని తెలిపారు. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం…