JK Assembly: ఆర్టికల్ 370 పునరుద్ధరణపై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఈరోజు మళ్లీ గందరగోళం నెలకొంది. కుప్వారాలోని పీడీపీ ఎమ్మెల్యే ఆర్టికల్ 370 పునరుద్ధరణపై బ్యానర్‌ను ప్రదర్శించడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఇవాళ మళ్లీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. తోపులాటలో భాగంగా అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్‌ను మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించారు. అసెంబ్లీలో పీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు గురువారం…