పవర్‌లో ఉన్నా... చాలా విషయాల్లో పైచేయి అవలేకపోతున్నామని ఫీలవుతున్నారట తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పెద్దలు. ప్రజలకు మంచి చేస్తున్నా... అది వెళ్ళాల్సినంత ఎక్కువగా వెళ్ళడం లేదన్న చర్చ పార్టీలో గట్టిగానే జరుగుతోందంటున్నారు. ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్న... విచ్చలవిడిగా పని చేసిన పార్టీ శ్రేణులు అధికారంలోకి వచ్చాక కాస్త సైలెంట్‌గా ఉంటున్నాయన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉందట. చివరికి ప్రతిపక్షాల విమర్శల్ని సైతం దీటుగా తిప్పికొట్టలేకపోతున్నామన్న అభిప్రాయం గాంధీభవన్ పెద్దల్లో ఉందంటున్నారు.