‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యూత్ గుండెల్లో సెగలు రేపి, ‘మంగళవారం’ మూవీతో ప్రేక్షకులలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఇక ఇప్పుడు ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. 6 భాషల్లో ‘వెంకటలచ్చిమి’గా పాన్ ఇండియా సినిమా చేస్తోంది. రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో ‘వెంకటలచ్చిమి’ మూవీ తాజాగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.