హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను చూసిన అభిమానులు అందరూ ఆశ్చర్యంతో, ఆనందంతో కేరింతలు కొట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సుజీత్ చేసిన పనికి తాను సినిమాలో వాడిన బట్టల్లోనే ఈవెంట్‌కి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లో ఫోటోలకు పోజులిస్తూ, కత్తితో నిలబడుతూ, కాసేపు అలా కూర్చుంటూ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
హైదరాబాద్‌లో జరుగుతున్న ఓజీ కన్సర్ట్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వర్షంలో కూడా తడుస్తూ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. చేతిలో సినిమాలో వాడిన జపనీస్ కత్తితో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్‌లో కనిపించారు. సింగిల్‌గా నడుస్తూ వచ్చిన ఆయన సింపుల్‌గా అలా వచ్చి స్టేజి మీద కూర్చుండడంతో, ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ అదిరిపోయారు. ఒకపక్క తమన్ అండ్ టీం లైవ్ సాంగ్ చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో, ఒకసారిగా అందరూ అవాక్కయ్యారు. దానికి…