Chandrababu Naidu: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడులో తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు హత్యపై సీఎం చంద్రబాబు హోంమంత్రిని నివేదిక కోరారు. కూటమి నేతలతో కలిసి రాళ్లపాడు వెళ్లి ఘటనపై నివేదిక ఇవ్వాలని హోం మంత్రి అనితను ఆదేశించారు. తన సోదరులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న లక్ష్మీనాయుడును కొద్దిరోజుల క్రితం అదే గ్రామానికి చెందిన హరిచంద్రప్రసాద్ కారుతో గుద్ది చంపాడు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు..
Pawan Kalyan: గురుకులలో ఇద్దరు విద్యార్థినుల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మృతి బాధాకరమన్నారు. కురుపాంలోని బాలికల గురుకులంలోని విద్యార్థినులు అనారోగ్యానికి గురైన విషయం తెలిసి బాధపడ్డానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. అక్కడి పిల్లలు కామెర్లు, సంబంధిత లక్షణాలతో అనారోగ్యానికి గురైనట్లు చెప్పారన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఇద్దరు…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా తెలుగు నాట మంచి విజయం అందుకుంది. అయితే ఇదే సినిమాపై కన్నడలో కొంత వివాదం నడిచింది. ఓజీ సినిమాకు బెంగుళూరులోని సంధ్య థియేటర్ వద్ద ప్రీమియర్స్ కు ఏర్పాట్లు చేయగా.. కన్నడ సంఘాలు వచ్చి గొడవ చేశాయి. దీంతో ఓజీ ప్రీమియర్స్ ను క్యాన్సిల్ చేశారు. అయితే కాంతార-1కు టికెట్ రేట్లను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో…
Gudivada Amarnath: కూటమి ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రభుత్వ కార్యాలయాల దండుకుంటున్నారో చెబుతూ బరితెగించి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తాజాగా అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే వారికి మందు తాగారా లేదా అని తెలుసుకునేందుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలి, ముఖ్యంగా బాలకృష్ణకు నిర్వహించాలన్నారు. చిరంజీవి అంటే బాలకృష్ణకి ఈర్ష, గతంలో చిరంజీవిని చాలా సార్లు అవమానించారన్నారు.. బాలకృష్ణకి చిరంజీవికి అసలు పోలికే లేదని.. చిరంజీవి స్వయంకృషితో ఎదిగిన…
తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ పెట్టడం ఆందోళనకు దారి తీసింది. ఆధ్యాత్మిక నగరంలో అపచారం జరిగిందని హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. ఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశాయి.