పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, హరి హర వీరమల్లు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ శరవేగంగా…