లులూ మాల్ గొంతెమ్మ కోర్కెలపై కూటమి పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. ఏపీకి ఆహ్వానించిన ప్రభుత్వమే.. ఇప్పుడు లులూపై గుర్రుగా ఉంది. రాష్ట్రానికి తానే అవసరమన్న ధోరణిలో లులూ ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసంతృత్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లులూకు ప్రభుత్వం ఇచ్చే భూముల విలువ, రాయితీలు ఎన్ని?.. లులూ ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని? అని కేబినెట్‌లో డిప్యూటీ సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్న లులూ.. తిరిగి ప్రభుత్వానికే షరతులు పెట్టడం…