పవన్ కళ్యాణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్టు రూపొందపోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, నిజానికి విజయ్తో చేసిన ‘వారసుడు’ సినిమా తరువాత వంశీ పైడిపల్లి ఇప్పటివరకు ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు. ఆయన ఆ మధ్య కాలంలో అమీర్ ఖాన్ కోసం ఒక కథ రాసుకున్నట్లు ప్రచారం జరిగింది. రాసుకోవడమే కాదు, ఆయన దగ్గరకు వెళ్లి వినిపించి కూడా వచ్చాడు.…
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితేంటి? అనేది ఎటు తేలకుండా ఉంది. ప్రజెంట్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ జరుపుకుంటున్నాయి ఈ సినిమాలు కానీ హరిహర వీరమల్లు మాత్రం అదిగో, ఇదిగో అనడమే తప్ప… అసలు ముందుకు కదలడం లేదు. హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయి చాలా రోజులు అవుతోంది. పవన్ రాజకీయంగా బిజీగా ఉండడంతో వెనక్కి వెళ్తునే ఉంది.…