పవన్ కళ్యాణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్టు రూపొందపోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, నిజానికి విజయ్తో చేసిన ‘వారసుడు’ సినిమా తరువాత వంశీ పైడిపల్లి ఇప్పటివరకు ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు. ఆయన ఆ మధ్య కాలంలో అమీర్ ఖాన్ కోసం ఒక కథ రాసుకున్నట్లు ప్రచారం జరిగింది. రాసుకోవడమే కాదు, ఆయన దగ్గరకు వెళ్లి వినిపించి కూడా వచ్చాడు.…