ఏపీలో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. ఏపీలో సమ్మె చేయని కార్మిక వర్గం లేదని ఆరోపించారు. అంగన్ వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, 108-104 అంబులెన్సుల ఉద్యోగులు సమ్మెలోనే ఉన్నారని తెలిపారు. వారి డిమాండ్ల మొత్తం విలువ జగన్ రెడ్డి తన విలాసాల కోసం తగలేసినంత ఉండొచ్చని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ అమలు కోసం పోరాడుతున్న వారిపై…
వైసీపీ సర్కారుపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు చేశారు. గృహనిర్మాణంపై మంత్రి జోగి రమేష్ రోగి రమేష్‌లా అసత్యాలు మొరుగుతున్నారని మండిపడ్డారు. గృహనిర్మాణం, ఇళ్ల పట్టాల విషయంలో జగన్ రెడ్డి అండ్ కో కోట్లాది రూపాయలను స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో 7.82 లక్షలకు పైగా పేదలకు పక్కా గృహ నిర్మాణం జరిగిందని అసెంబ్లీలో గత మంత్రి రంగనాథరాజు స్వయంగా వెల్లడించారని గుర్తుచేశారు. గత మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్…
ఏపీలో నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ మాట్లాడుతూ.. పట్టాభిరామ్ మాట్లాడింది దారుణమైన భాష అన్నారు. అంతేకాకుండా పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేసిన తరువాత నుంచే ఆందోళనలు ప్రారంభమయ్యాయన్నారు. చట్టబద్దమైన పదవుల్లో ఉన్న వారిని తిట్టకూడదన్నారు. పట్టాభిరామ్ నోరు జారి మాట్లాడిన మాటలు కాదని, ఒక పార్టీ ఆఫీసు నుంచి మాట్లాడించారన్నారు. ఒక ముఖ్యమంత్రిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు. దీనితో పాటు నిన్న 5.03 నిమిషాలకు తెలియని…