సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. వరుసగా రెండవసారి టికెట్ ఆశించి భంగపడటంతో పటేల్ రమేష్ ఆయన సతీమణి లావణ్య రెడ్డి బోరున విలపించారు.
సూర్యాపేట కాంగ్రెస్‌లో స్థానికత అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చి చర్చగా మారింది. ఇక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత పటేల్ రమేష్‌రెడ్డి మధ్య ఓ రేంజ్‌లో వర్గపోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడానికి ఇద్దరూ కుస్తీ పడుతున్నారు. దీంతో రెండు వర్గాలు హోరాహోరీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.. అదే విధంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఇప్పుడు లోకల్.. నాన్ లోకల్ అంశం వీరి మధ్య చిచ్చు పెడుతోంది. రమేష్‌రెడ్డిపై ఆ మధ్య…