టికెట్ రేటు పోగా మిగిలిన డబ్బు ఇవ్వాలని అడిగినందుకు ఓ ప్రయాణికుడిపై కండక్టర్ దాడి చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భరత్‌పూర్ నుంచి ఆగ్రాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ ప్రయాణికుడు భరత్‌పూర్ నుంచి ఆగ్రాకు వెళ్తున్నాడు. అయితే అతడు వెళ్లాల్సిన గమ్యస్థానానికి కండక్టర్‌కు 500రూపాయలు ఇచ్చాడు. అయితే టికెట్ ధర 64రూపాయలు మాత్రమే…