ఎంపీ శశి థరూర్‌కు సొంత పార్టీ కాంగ్రెస్‌తో విభేధాలు ఉన్నాయని పుకార్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల.. అమెరికాకు వెళ్లే ప్రతినిధి బృందానికి భారత ప్రభుత్వం శశి థరూర్‌ను నాయకుడిగా నియమించింది. విదేశాలకు వెళ్లే ప్రతినిధి బృందం కోసం కాంగ్రెస్ శశి థరూర్ పేరును ప్రతిపాదించలేదు.