Parliament's Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వేళైంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన తర్వాత సెషన్ ప్రారంభమవుతుంది.