Hyderabad: హైదరాబాద్ నగరంలో సాధారణంగానే కొన్ని పార్కులకు ఫ్యామిలీలు వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇందిరా పార్క్ లాంటి పార్కుల్లో కొందరు ప్రేమికులు బహిరంగంగా రొమాన్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు. మరికొన్ని పార్కుల్లో అయితే చైన్ స్నాచింగ్ వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు పార్కుల్లోనూ సీసీ కెమెరాలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 8 వేల కెమెరాలను…
ఒకప్పుడు హైదరాబాద్ అంటే ట్రాఫిక్ జాంలు, కాలుష్యం.. కానీ ఇప్పుడు నగరం తీరు మారింది. నగరం అంతా పచ్చదనం పరుచుకుంటోంది. కాంక్రీట్ తో కట్టుకున్న ఫ్లై ఓవర్లు కింద పచ్చని మొక్కలు కనిపిస్తూ మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అసలు మనం సిటీలోనే వున్నామా.. ఇన్ని ఫ్లై ఓవర్లున్నా అంతగా కాలుష్యం రావడం లేదని అంతా అవాక్కవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ చేపడుతున్న వివిధ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయి. హైదరాబాద్‌లో షేక్ పేటలో నిర్మాణమవుతున్న…
హైదరాబాద్ నగరంలో మీరు పార్కులకు వెళ్తున్నారా? అయితే మీ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) శుభవార్త తెలిపింది. సంజీవయ్య, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్‌కు వెళ్లే పర్యాటకుల వద్ద కెమెరాల కోసం ఇకపై ఫీజులు వసూలు చేయబోమని HMDA వెల్లడించింది. గతంలో ఈ మూడు పార్కుల్లోకి కెమెరాతో వెళ్తే అదనంగా రూ.1000 వసూలు చేసేవారు. ఇప్పుడు కెమెరాలకు, వీడియో కెమెరాలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని HMDA ప్రకటించింది. ప్రజల విజ్ఞప్తుల మేరకు…