ఒక పారిశ్రామికవేత్త ముంబై విమానాశ్రయంలో ఒక ప్లేట్ పానీ పూరి యొక్క అధిక ధరపై తన ఆశ్చర్యాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ అంతటా వైరల్ గా మారింది. మామూలుగా మనం రోడ్డు పక్కల దొరికే పానీ పూరి బండి వద్ద ప్లేట్ పానీపూరీలకు 20 రూపాయల నుంచి 40 మధ్యలో చెల్లిస్తాము. అదే కాస్త రెస్టారెంట్ లోపల వెళితే 50 రూపాయల నుంచి వంద రూపాయలు వరకు ప్లేట్ పానిపురికి చెల్లిస్తాం.…