Sarpanch Eligibility: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్ (EC). గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని సోమవారం విడుదల చేశారు. తొలుత మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సమరం మొత్తం ఐదు దశల్లో జరగనుంది. మండల, జిల్లా పరిషత్‌ల తొలి విడత ఎన్నికలు అక్టోబర్ 23న, రెండో విడత అదే నెల 27న జరగనున్నాయి. గ్రామ పంచాయతీల…