Congress: రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించింది. మూడో విడత ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ బలపర్చిన 2,060 మందికి పైగా సర్పంచ్‌లు విజయం సాధించారు. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు భారీగా లభించిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల్లో 1,060 మందికి పైగా సర్పంచ్‌లుగా గెలుపొందారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల గెలుపులను కలిపినా మొత్తం సర్పంచ్ స్థానాల్లో 30 శాతం…