Krishna: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఉచిత ఇసుక’ పథకం కొందరికి వరంగా మారితే, పామర్రు నియోజకవర్గంలో మాత్రం అధికార పార్టీ నేతలకు కాసులు కురిపించే గనిగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి, నది గర్భాన్ని ఛిద్రం చేస్తూ ఇసుక మాఫియా సాగిస్తున్న దందా ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. పామర్రు నియోజకవర్గ పరిధిలోని రొయ్యూరు, లంకపల్లి, తోట్లవల్లూరు ఇసుక రీచ్‌లు ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, అధికార పార్టీకి చెందిన ముగ్గురు…