పోడు భూములు రణ రంగాన్ని సృష్టిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొడు రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో కేసీఆర్ కుర్చీ వేసుకొని పొడు భూముల పట్టాలు పంచుతామని చెప్పి, పొడు రైతులను నిండా ముంచారన్నారు. పొడు రైతుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, 30, 40 సంవత్సరాల నుంచి పొడు భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉన్న ఫలంగా భూములు గుంజుకుంటే రైతులు…