Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. అయ్యప్పమాల ధరించిన విద్యార్థులు ఒంగోలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు కారులో ఒంగోలుకు బయలుదేరారు. నాదెండ్ల మండలం గణపవరం బైపాస్ రోడ్డులో ముందుగా వెళ్తున్న కంటైనర్ లారీని కారు వెనుకనుంచి ఢీకొంది. ప్రమాదంలో కారు పూర్తిగా లారీ కిందకు వెళ్లిపోయింది. ఘటనలో నలుగురు విద్యార్థులు స్పాట్ లోనే మృతి చెందారు. తీవ్రంగా…